తమ్ముడు సినిమా కి 18 సంత్సరాలు – ఒక తీపి అనుభవం

అది 1999 వ సంత్సరం.. మా సొంత వూరు శ్రీకాకుళం జిల్లా, కానీ మా నాన్న గారు విజయనగరం లో జాబ్ చేస్తుండే వారు.నేను హైదరాబాద్ లో డిప్లొమా చదువుతున్నాను. ఒక సారి కాలేజీ కి కొన్ని రోజులు సెలవలు వచ్చాయి.నేను అమ్మ నాన్న ల దగ్గరకి వెళదాము అని హైదరాబాద్ నుంచి విశాఖ ఎక్ష్ప్రెస్స్ ఎక్కి వైజాగ్ లో దిగి, అక్కడ నుంచి బస్సు లో విజయనగరం భయలుదేరాను.విజయనగరం బస్సు స్టాండ్ లో బస్సు దిగి ఆటో లో ఇంటికి భయలుదేరాను. అలా వస్తుండగా బస్సు స్టాండ్ గోడ ఫై ఒక సినిమా పోస్టర్ చూసాను. ఆ పోస్టర్ లో కేవలం ఆ సినిమా పేరు మాత్రమే వుంది, ఆ పేరు వెనక చుర చుర చూపుల తో ఒక హీరో కిక్ బాక్సింగ్ గ్లౌసెస్ తో చేతులు మొక్కాన్ని సగం అడ్డుగా పెట్టుకొని వున్నాడు.ఆ ఒక్క క్షణం నా వొళ్ళు జలదరించింది, ఆనందం తో పులకరించి పోయాను. ఆటో స్పీడ్ గ వెళ్లడం వల్ల 2 సెకండ్స్ కంటే ఎక్కువ సేపు చూడలేక పోయాను.నాకు ఆ పోస్టర్ లో వున్నది నేను అనుకున్న వ్యక్తా, కాదా అని కూడా తెలియదు.కానీ ఆ 2 సెకండ్స్ లో చూసిన పోస్టర్ లో ఆ శక్తీ గల కళ్ళు వల్ల నాలో బలమైన నమ్మకం కలిగింది, ఆ వ్యక్తి నేను అనుకున్న హీరో నే అని.అటువంటి పోస్టర్ కోసం ఆటో లో నుంచే వెతుకుతూనే వున్నాను, కానీ ఎక్కడా కనిపించలేదు. ఒక రకమయిన వైబ్రేషన్స్ లో వున్నాను.

ఇంటికి చేరుకున్నాను, అమ్మ కి మొక్కుబడిగా పలకరించాను. స్నానం చేసుకున్నాను, భోజనం చేసాను, టీవీ చూస్తున్నాను.. ఇన్ని పనులు చేస్తున్నా ఆ పోస్టరే నా మైండ్ లో తిరుగుతుంది. సాయంత్రం అలా వాకింగ్ చేద్దాము అని బయటకి వచ్చా.ఆ పోస్టర్ మల్లి చూడాలి అనిపించింది. అంతే, బస్సు స్టాండ్ వరుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఆ పోస్టర్ చూసాను. నేను అనుకున్నదే నిజం అయ్యింది .నేను అనుకున్న హీరో నే ఆ పోస్టర్ లో వున్నది.ఇంకా నా ఆనందానికి హద్దులు లేవు. అందులో వున్నది అప్పటికి నేను పిచ్చి పిచ్చి గా అభిమానిస్తున్న పవన్ కళ్యాణ్, ఆ పోస్టర్ తమ్ముడు సినిమా ది. ఆ ఆనందం లో ఆ పోస్టర్ చూసుకుంటూ ఒక అర గంట అక్కడే ఉండిపోయాను. మల్లి ఇంటికి నడుచుకుంటూ ఆ సినిమా గురించి ఊహించుకుంటూ ఇంటికి వచ్చేసాను. ఇది నా లైఫ్ లో ఒక తీయటి అనుభూతి గ ఉండిపోయింది.

కింద వున్నది అదే పోస్టర్

తమ్ముడు సినిమా 18 సంత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగ, ఈ నా అనుభవాన్ని మీతో పంచుకోవాలి అనుకున్న.

I watched this movie 8 times in theaters, 2nd highest after Tholiprema [12 Times] 🙂

Thank You Very Much For Reading My Experience 

STRICTLY ABOUT CINEMA

 

Leave a Reply

Your email address will not be published.